పవన్‌ ఫ్యాన్స్‌కు నిరాశే!

28
pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ – రానా మల్టీస్టారర్‌లుగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లానాయక్. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులందరూ దాన్నే ఫిక్స్ అయిపోయారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి భీమ్లా నాయక్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 కి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చేవరకు పుకార్లకు చెక్ పడేలా కనిపించడం లేదు.