తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ…

87
amith shah

ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర బీజేపీ కీలక నేతలంతా ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సంగ్రామ యాత్రపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపైనా నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. హుజూరాబాద్ లో గెలుపు తర్వాత అమిత్ షాతో జరుగుతున్న విస్తృతస్థాయి సమావేశం ఇదే కావడంతో.. అందరి దృష్టి ఈ మీటింగ్ పైనే ఉంది.

యాసంగి వడ్ల కొనుగోలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు, నిరుద్యోగం వంటి అంశాలపై తెలంగాణ బీజేపీకి సూచించింది.