- Advertisement -
యూపీ మాజీ సీఎం, దేశ రాజకీయాల్లో సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలపగా తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు.
ములాయ మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు. ములాయం సింగ్ యాదవ్, నవంబర్ 22, 1939 న జన్మించారు. మూడు సార్లు యూపీ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్న ములాయం..దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.
- Advertisement -