- Advertisement -
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ బోడకుంటి విజయలక్ష్మి ద్వాదశదిన కర్మ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం బోడకుంటి వెంకటేశ్వర్లును ఓదార్చి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే కృష్ణారావు తదతరులు ఉన్నారు.
- Advertisement -