జయరాం రెడ్డి పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ నివాళి..

36

హైదరాబాద్ విద్యానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గుండెపోటుతో మరణించారు. జయరాం మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం జయరాం రెడ్డి పార్థివదేహానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.