యంగ్‌ హీరోతో అనుష్క రొమాన్స్‌..!

57
Anushka Shetty

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో సినిమాకి అంగీకరించడానికి స్వీటీ చాలా ఎక్కువ సమయమే తీసుకుంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. తొలిచిత్ర దర్శకుడు రమేష్ వినిపించిన స్క్రిప్ట్ నచ్చిందని అనుష్క ఓకే చెప్పారని ఇటీవల ప్రచారమైంది. బౌండ్ స్క్రిప్ట్ తో యువదర్శకుడు స్వీటీని కన్విన్స్ చేయగలిగారు. దీంతో ప్రాజెక్టుకి ఓకే చెప్పేశారు.

వివరాల్లోకి వెళితే.. దాదాపు నలబై ఏళ్ల వయసున్న మహిళ, పాతికేళ్ల కుర్రాడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వారి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా.. లేదా? అనే అంశాలతో దర్శకుడు కథను సిద్ధం చేశాడట. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క నటిస్తే.. ఆమెను ప్రేమించే యువకుడిపాత్రలో నవీన్‌ పొలిశెట్టి కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. యువి క్రియేషన్స్ తో కలిసి అనుష్క ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.