తెలంగాణ..దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో ముందుంది- కేటీఆర్‌

194
Minister KTR Participates In CII Southern Regional Council Meeting..
- Advertisement -

దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో ముందున్న రాష్ట్రం తెలంగాణ అని తేల్చిచెప్పారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. అంతేకాకుండా పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నామని కూడా పేర్కొన్న ఆయన..పలు ప్రముఖ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. ఐటీ ఎగుమతుల్లో 14 శాతం వృద్ధితో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

నేడు సీఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన వివిధ కంపెనీల ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌, సీఐఐతో కలిసి మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ సెంటర్ ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. మాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ కార్యాలయాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని, హైదరాబాద్‌లో ఏరోస్పేస్ రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయని గుర్తు చేశారు. ఐటీ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని కేటీఆర్ తెలిపారు. మార్చి 8న మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్న కేటీఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. కాగా..ఈ సమావేశాకిని కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు.

- Advertisement -