బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకొని ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఎదిగింది. ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. నిండైన వస్త్రధారణ, అసభ్యతకు తావు లేకుండా ఓ ఈవెంట్ ను హోస్ట్ చేయడంలో యాంకర్ శ్యామలకు మంచి పేరు ఉంది. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆమె పొందిన చేదు అనుభవం గురించి చెప్పింది. ఓ నీలి చత్రంలో నటించిన ఓ మోడల్ ఫేస్ కు తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి, ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టారని చెప్పింది. అయితే, ఆ వీడియోను అప్ లోడ్ చేసిన వెబ్ సైట్ వారితో మాట్లాడి, వీడియోను తొలగించామని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియోను తన భర్త తనకు షేర్ చేసేంత వరకు తెలియదని చెప్పింది.
నా భర్త కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే కావడంతో, ఆ వీడియోను లైట్ తీసుకున్నాడని… ఇలాంటివి సహజమే అంటూ పట్టించుకోలేదని తెలిపింది. తన భర్త తనను అర్థం చేసుకోకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తుందని చెప్పింది. దూరంగా ఉన్న వ్యక్తులను దగ్గర చేయడానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని… ఇదే సమయంలో, చెడు విషయంలోనూ అంత దరిద్రమైందని శ్యామల తెలిపింది.

