ఈరోజు మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా.. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు మరియు దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, డాక్టర్ తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామర్థ్యం 8 లక్షల లీటర్లు. వాటర్ ట్యాంకు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్ వీక్షించారు. వరంగల్ పర్యటనలో భాగంగా మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.