‘ఖిలాడి’ టీజర్‌: ఎమోషన్స్ లేనివాడిని ఎవరూ ఆపలేరు

143
KhiladiTeaser
- Advertisement -

మస్‌ మహారాజా రవితేజ ‘క్రాక్’ తరువాత హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా అలరించనున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మే 28వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను వదిలారు చిత్ర బృందం.

అన్ని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.ప్రధానంగా యాక్షన్ .. ఎమోషన్ చూట్టు కథ ఉండనుంది. చివరి వరకూ ఎలాంటి డైలాగ్స్ లేకుండా, రవితేజ లైఫ్ లోని పరిణామాలపై కట్ చేసిన విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. విజువల్స్ కి తగినట్టుగా ఆర్ ఆర్ అదిరిపోయింది. హీరో ఎందుకు క్రిమినల్ గా మారాడు? ఎందుకు జైలుకు వెళ్లాడు? అనే ఆసక్తిని ఈ టీజర్ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా టీజర్ లాస్ట్ లో రవితేజ ‘ఎమోషన్స్ లేనివాడిని ఎవరూ ఆపలేరు’ అంటూ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

- Advertisement -