త్వరలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం: కేటీఆర్

177
minister ktr
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పీఆర్‌టీయు తెలంగాణ శాఖ డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..ఉపాధ్యాయుల సమస్యలు త్వరలో పరిష్కాస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

త్వరలో జరుగబోయే పట్ట భద్రుల శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారెడ్డి అంజిరెడ్డి, ఎం చెన్నయ్య ..కేటీఆర్‌కి లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పర్వతి సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె అనంత్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -