బాల్క సురేష్ మృతి పట్ల మంత్రుల సంతాపం..

176
balka suresh
- Advertisement -

ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.సురేష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించి, బాల్క సుమన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాల్క సురేష్ పరమపదించారని తెలుపుటకు చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సతాపం వ్యక్తం చేశారు.

కాగా, బాల్క సురేష్ అకాల మరణం పట్ల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సురేష్ తన కొడుకు సుమన్ విద్యార్థి పోరాటాలలో చురుగ్గా ఉండేందుకు ప్రోత్సాహించారన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సురేష్ రైతులకు విలువైన సేవలందించారని మంత్రి గుర్తు చేసుకున్నారు.ఆయన మృతి టీఆర్ఎస్‌కు, మెట్‌పల్లి ప్రాంతానికి తీరని లోటన్నారు. సుమన్ కుటుంబ సభ్యులకు మంత్రి తన సంతాపాన్ని, సానుభూతి తెలిపారు. సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

బాల్క సురేశ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్ధించారు.

- Advertisement -