భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌…డ్రమ్స్‌ వాయించిన కేటీఆర్

145
ktr minister
- Advertisement -

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కాంబోలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ నెల 25న సినిమా రిలీజ్ కానుండగా బుధవారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు మంత్రి కేటీఆర్.

ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి భీమ్లా నాయక్ మూవీలో పాటలకు పర్ఫార్మ్ చేస్తూ డ్రమ్స్ వాయించారు. వీరిద్దరూ కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉండగా శివమణి వెళ్లి హీరో పవన్‌ కళ్యాణ్‌ను, మంత్రి కేటీఆర్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చి వారితో డ్రమ్స్ వాయించేలా చేశారు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఇద్దరూ కూడా డప్పు వాయించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

- Advertisement -