బ్యాంకులకు ఎగనామం..కేంద్రం కీలక ప్రకటన

192
ed
- Advertisement -

బ్యాంకుల నుండి వేల కోట్ల అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు వారి నుండి రూ.18 వేల కోట్లు వసూలు చేసిందని కేంద్రం వెల్లడించింది.

ఇప్పటి వరకు 4,700 కేసులను ఈడీ విచారించినట్టు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.67వేల కోట్లను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరై తన వాదనలు వినిపించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన వారికి కోర్టులు కల్పిస్తున్న రక్షణ కారణంగా పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు ఇప్పటికీ నిలిచిపోయిందన్నారు.

- Advertisement -