తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ వ్యాపార కేంద్రంను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీకి అవసరమయ్యే సాఫ్ట్‌వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వెబ్ పీటీ సంస్థ నగరంలో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
2008లో అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రారంభమై వెబ్ పీటీ సాఫ్ట్‌వేర్ ను ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను రూ.150కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు మరింత మెరుగైన పద్దతుల్లో రీహాబిలిటేషన్ థెరపీని అందించడానికి వైద్య సంస్థలకు అవసరమయ్యే ఎండ్ టు ఎండ్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ ను వెబ్ పీటీ సాఫ్ట్ వేర్ అందిస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం వెబ్‌పీటీ సంస్థకు భాగస్వామిగా ఉంటుందని హామినిచ్చారు. ప్రతిభావంతులైన మానవవనరులను సమర్థ సుస్థిర ప్రభుత్వం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కలిగినందునే గ్లోబల్ కెపబిలిటీస్ సెంటర్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోందన్నారు. రూ.150కోట్ల రూపాయలతో గ్లోబల్ కేపబిలిటీస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న వెబ్ పీటీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Telangana continues to attract investments at #wef23@WebPT announces Global Capabilities Centre (GCC) in Hyderabad with ₹150 Crore investment.
WebPT is one of the fastest-growing outpatient rehab therapy software platforms in the world.#TelanganaAtDavos pic.twitter.com/Bb2WkoVAjI
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 19, 2023
వెబ్ పీటీ సీఈఓ ఆష్లే గ్లోవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ షుగా, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సీఈఓ సందీప్ శర్మ లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు, ఐటీ,పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్‌తో దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సమావేశమై…. తమ విస్తరణ ప్రణాళికలను సుదీర్ఘంగా చర్చించారు.
ఇవి కూడా చదవండి…