ఈ నెల 28వ తేదీ నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖర రావు గారి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభ ఉంటుందని తెలిపారు మంత్రి కేటీఆర్. సభా ఏర్పాట్లను మంత్రి తలసానితో కలిసి పరిశీలించారు కేటీఆర్.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…నగర ప్రజలకు తాగునీటి సరఫరాను ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకున్న పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తల మధ్య సభ జరుగుతుందని హైదరాబాద్ అభివృద్దే తమ ఎజెండా అన్నారు. గ్రేటర్ ప్రజల మధ్య చిచ్చుపెట్టేవారు ఎంతటివారైన వదిలిపెట్టమని తెలిపారు.శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని వెల్లడించారు.
హైదరాబాద్ నగరానికి ఎన్నికలు వస్తుంటాయ్.. పోతుంటాయని, ఎవరైనా హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే ప్రయత్నం కఠిన చర్యలుంటాయని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. ఓ పిచ్చాయన సమాధులు కూలుస్తా అంటడని, మరో పిచ్చాయన ప్రజలను రాంగ్ రూట్‌లో బండ్లు నడపమని రెచ్చగొడుతాడని, ఇలాంటి రెచ్చగొట్టేలా మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే ఊపేక్షించేది లేదన్నారు.
ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. సభ సందర్భంగా స్టేడియం లోపల, చుట్టుపక్కల భద్రతా ఏర్పట్లకు సంబంధించిన అంశాలను సీఎం అంజనీ కుమార్ వివరించారు. అదేవిధంగా సభా వేదికను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.