హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచాం: మంత్రి కేటీఆర్

127
ktr minister
- Advertisement -

ఎంతో కష్టపడి హైదరాబాద్‌ బ్రాండ్‌ వ్యాల్యూ పెంచామని తెలిపారు మంత్రి కేటీఆర్. నగరంలోని నిజాం క్లబ్‌లో జరిగిన విశ్వనగరంగా హైదరాబాద్‌ సదస్సులో పాల్గొన్న కేటీఆర్…. ప్రభుత్వంపై విశ్వాసం వల్లే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్‌ఐపాస్‌ తీసుకొచ్చామని చెప్పారు.

దేశంలోనే హైదరాబాద్‌ అరుదైన నగరమని …. హైదరాబాద్‌కు 400 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని తెలిపారు కేటీఆర్. ఈ నగరానికి తనదైన సంస్కృ తి, చరిత్ర, వైవిధ్యం ఉన్నాయని, పురాతన కట్టడాలు, ఆధునిక నిర్మాణాల కలబోత హైదరాబాద్‌ అని తెలిపారు.టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించామన్నారు.

గతంలో హైదరాబాద్‌ ప్రజలకు 14 రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. హైదాబాద్‌ మంచినీటి సరఫరాకు 1920లో గండిపేట చెరువు కట్టారని చెప్పారు. గత వందేండ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా నీటి సరఫరాపై దృష్టిపెట్టలేదన్నారు. త్వరలో తాము కేశవాపురం రిజర్వాయర్‌ నిర్మించబోతున్నామని చెప్పారు.శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -