తలసారి ఆదాయంలో అగ్రగామిగా తెలంగాణ..

83
ktr
- Advertisement -

తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. త‌ల‌స‌రి ఆదాయం 2014 నుంచి 2021 వ‌ర‌కు 125 శాతం పెరిగిందని…జీఎస్‌డీపీ 130 శాతం పెరిగిన‌ట్లు తెలిపారు. తెలంగాణ అన్నింటిల్లోనూ వెలిగిపోతోంద‌ని, ఆ వైభ‌వ‌మే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజ‌య‌ప‌థంలో దూసుకువెళ్తోంద‌ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తల‌స‌రి ఆదాయంలో తెలంగాణ అగ్ర‌గామిగా నిలిచింద‌ని… కేంద్రం విడుద‌ల చేసిన గ‌ణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయ‌న్నారు. విభ‌జ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాన‌ప్ప‌టికీ, క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైన‌ప్ప‌టికీ, కేంద్రం నుంచి ఎలాంటి స‌హ‌కారం లేన‌ప్ప‌టికీ…సీఎం కేసీఆర్ తన నాయకత్వ పటిమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు.

- Advertisement -