శరవేగంగా ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు..

176
ktr minister
- Advertisement -

భిన్న సంస్కృతులకు కేరాఫ్ అడ్రస్.. హైదరాబాద్. ఈ మహానగరం పేరు చెప్తే చాలు.. అందరికీ గుర్తొచ్చేది.. చార్మినార్, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, గోల్కొండ.. ఎందుకంటే నగరానికి వచ్చిన ఎవరైనా సరే.. వీటిని చూడాల్సిన ప్రదేశాలు. ఈ నేపథ్యంలోనే చారిత్రాక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించిన టీఆర్ఎస్ సర్కార్ టూరిజాన్ని మరింతగా డెవలప్‌ చేసింది.

ట్యాంక్ బండ్ సుందరీకరణలో భాగంగా పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిందిద్దింది. ప్రత్యేకంగా ట్యాంక్ బండ్‌పై లవ్ హైదరాబాద్‌ని ఏర్పాటుచేయగా రోజుకు వందల సంఖ్యలో సందర్శకులు సెల్ఫీలు దిగుతూ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సుందరంగా తీర్చిదిద్దిన ట్యాంక్ బండ్ ఫోటోలను షేర్ చేసిన మంత్రి కేటీఆర్…ప్రస్తుతం పని జరుగుతోందని త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు. అంతేగాదు దీనిపై కామెంట్స్‌, సూచనలు ఇవ్వాలని నెటిజన్లను కోరారు మంత్రి కేటీఆర్.

- Advertisement -