శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్

179
minister ktr
- Advertisement -

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో పోలీసుల పాత్ర కీలకమైందన్నారు మంత్రి కేటీఆర్. గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీతో క‌లిసి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…బంజారాహిల్స్‌లో అధునాత‌న టెక్నాల‌జీతో నిర్మిస్తున్న క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ రెండు నెల‌ల్లో అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు.

గ‌త ఆరేళ్ల‌లో రాష్ర్ట పోలీసుల ప‌నితీరు అద్భుతంగా ఉంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాల పాల‌న‌లో ప్ర‌తి సంవ‌త్స‌రం హైద‌రా‌బాద్‌లో ఒక వారం రోజులు క‌ర్ఫ్యూ ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదన్నారు.బ తెలంగాణ‌లో క్రైమ్ త‌గ్గింది. మ‌త ఘ‌ర్ష‌ణ‌లు లేనే లేవు. ప్రాంతీయ విద్వేషాలు, వివ‌క్ష‌త లేదన్నారు.

ఒకనాడు తెలంగాణ‌లో రెండు పోలీసు క‌మిష‌న‌రేట్లు మాత్ర‌మే ఉండేవి. మ‌రో 7 క‌మిష‌న‌రేట్లు ఏర్పాటు చేసుకున్నాం. 100 పోలీసు స్టేష‌న్లు ప్రారంభించుకున్నాం అన్నారు. సీసీ కెమెరాల్లో 65 శాతం హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి….. ఒక వేళ దొంగ‌త‌నం జ‌రిగినా.. కేవ‌లం నాలుగైదు గంట‌ల్లోనే పోలీసులు కేసును ఛేదిస్తున్నారని తెలిపారు.

మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం షీటీమ్స్‌తో పాటు హాక్ ఐ యాప్‌ను రూపొందించారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -