ఓటు హక్కు వినియోగించుకోండి…

143
gic
- Advertisement -

ఈ రోజు మగ్నిజంట్ డిజిటల్ సొల్యూషన్స్ డైరక్టర్ గర్రెపల్లి సతీష్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ వరలక్ష్మి గారి అధ్వర్యంలో మొదట మొక్కను నాటి ఓటు అవగాహన సదస్సు నిర్వహించి తరువాత జయాస్ రంజన్ IAS గారు ,ATS డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు రాఘవ్ గారు డాక్టర్ దశరథ రామ్ రెడ్డి గారు మరియు మిట్టపల్లి సురేందర్ గారి చేతులమీదుగా ఓటు విలువను తెలిపే విధంగా సాంగ్ లాంచ్ చెయ్యడం జరిగింది.

ఓటు ఎంతో విలువయినది అని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని రంజన్ గారు తెలపడం జరిగింది స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలకు ఇలాంటి ఓటు అవగాహన సదస్సు నిర్వహించడం ఎంతో సంతోషకరమని అని వరలక్ష్మి గారు అన్నారు. యువతకు ఓటు విలువ తెలిపే ఈ కార్యక్రమానికి సహకరించిన SK international ఛైర్మెన్ కిషన్ కవికొండల గారికి గర్రెపల్లి సతీష్ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో MDS టీం మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ టీం పాల్గొన్నారు..

- Advertisement -