కేటీఆర్‌కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు..!

220
minister KT Rama Rao to get Leader of the Year award in Delhi
- Advertisement -

పరిశ్రమలు, పురపాలక శాక మంత్రి కేటీ రామారావుకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇప్పటికే పలు జాతీయ అవార్దులు దక్కించుకున్న మంత్రికి ఈసారి లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ మంత్రి కెటి రామారావుకు ఈ అవార్డును ప్రధానం చేయనుంది.

మంత్రిగా నూతన తెలంగాణ రాష్ర్టాన్ని దేశ యవనికపైన తనదైన శైలిలో నిలిపిన తీరుని సంస్ధ ఈ సందర్బంగా అభినందించింది. దీంతోపాటు పాలన పరంగా మంత్రి నిర్వహిస్తున్న భాద్యతలు, తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులు తెస్తున్న తీరు, దేశ వ్యాప్తంగా మంత్రికి లభించించిన పేరు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ఇస్తున్నట్లు బిజినెస్ వరల్డ్ తెలిపింది.

 minister KT Rama Rao to get Leader of the Year award in Delhi

పట్టణ మౌళిక వసతులున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ర్టానికి మరో అవార్డును సంస్ధ అందించనున్నది. పట్టణాల్లో మిషన్ భగీరథ( అర్భన్) కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇంటింటికి రక్షిత తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టినందుకు బిజినెస్ వరల్డ్ ప్రత్యకంగా ప్రస్తావించింది. ఈ కార్యక్రమంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో గ్రీన్ కవర్ను పెంచేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పట్టణాల్లో అమలు చేయడం, హైదరాబాద్ నగరంలోనే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా పేద ప్రజలకు పక్కాగృహాలు అందించే అంశాల్లో చేస్తున్న కృషిని పరిగణలోకి తీసుకున్నామని బిజినెస్ వరల్డ్ తెలిపింది.

అవార్దులతోపాటు తామ నిర్వహిస్తున్న ఐదవ జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్కు హాజరుకావాల్సిందిగా మంత్రికి సంస్ధ ఆహ్వానం పంపింది. ఈనెల ఢిల్లీలో 20వ తేదీన జరగనున్న ఈ సదస్సులో స్మార్ట్, సెఫ్ మరియు సస్టైనబుల్ సిటీస్ అనే అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనున్నది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ సూరి హాజరుకానున్న ఈ సమావేశంలో నగరాల్లో ఇంటిగ్రేటేడ్ ట్రాన్స్పోర్టేషన్, స్మార్ట్ హెల్త్ కేర్, డిజిటల్ పరిష్కారాల ద్వారా పట్టణ సమస్యల పరిష్కారాలను ఈ సమావేశంలో( ఏక్స్ ఫో) ప్రదర్శించనున్నారు.

- Advertisement -