ఐష్‌ని మందలించిన బిగ్‌ బీ..!

231
When Amitabh Bachchan asked Aishwarya Rai to stop ...
- Advertisement -

అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ లకు సంబంధించిన వీడియోఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కానీ ఆ వీడియో రెండు సంవత్సరాల క్రితం జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల ప్రోగ్రామ్ లోదని తెలుస్తోంది. ఆ వీడియోనేఇప్పుడు చక్కర్లు కొడుతోంది.‘జజ్బా’ చిత్రానికి గానూ ఐశ్వర్యారాయ్, ‘పీకూ’ చిత్రానికిగానూ అమితాబ్ బచ్చన్ లు ఉత్తమ నటీ నటుల అవార్డులను అందుకున్నారు.

అవార్డును తీసుకున్న అనంతరం అమితాబ్‌ తో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్న ఐష్, ‘ఈయనే బెస్ట్‌’ అంటూ చిన్నపిల్లలా తన మామయ్య వైపు చూపుడు వేలు చూపింది. వెంటనే స్పందించిన అమితాబ్, చిన్న పిల్లల చేష్టలేంటంటూ, ‘ఐష్‌.. ఆరాధ్యలా ప్రవర్తించకు’ అని అన్నారట! సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోన్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -