పట్టణాల్లో జెట్ స్పీడ్‎తో హరితహారం

244
ktr
- Advertisement -

పట్టణ ప్రాంతాల్లో హరితహారం విజయవంతం కావాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక, అటవీ శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురపాలికల్లో హరితహారం కార్యక్రమంపై సమావేశంలో చర్చకు వచ్చింది. హరితహారంపై జూన్‌లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్లతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పట్టణాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలతో అధికారులు భేటీ కావాలని మంత్రి ఆదేశించారు.

ktr

మొక్కలు నాటేందుకు స్థలాలను ముందే ఎంపిక చేయాలన్నారు. వాహనాల్లో ప్రజల వద్దకే మొక్కలు తీసుకెళ్లి పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున హరితహారం నిర్వహించాలన్న మంత్రి.. పార్కులు, డంప్ యార్డుల్లో మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శ్మశాన వాటికలు, చెరువుల చుట్టూ మొక్కలు నాటడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హరితాహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, సీడియంఏ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఎ, ఫారెస్ట్‌, టీయస్‌ఐఐసీ అధికారులు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -