కార్యకలాపాలు ప్రారంభించని గనుల లీజులను రద్దు చేస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ రోజు బేగంపేటలోని పాత క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. లీజులు పొంది గడువులోగా కార్యకలాపాలు లేకుండా పడి ఉన్న గనులపైన చర్యలు తీసుకోవాలని గనుల శాఖాధికారులను అదేశించారు.
లీజుల పత్రంలోని నిభందనల మేరకు మైనింగ్ ప్రారంభించి ఉంటే ప్రభుత్వానికి అదాయంతోపాటు ఉపాది పెరిగేదని, ఇలా నిభందనలను పాటించని వాటికి మార్గదర్శకాలకు అనుగుణంగా నోటీసులు ఇవ్వాలన్నారు. ఈ గనుల యాజమాన్యాలకు నోటీసులిచ్చి, వాటి లీజులను రద్దు చేయాలన్నారు. ఈ గనులను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు వారం రోజుల్లోగా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంలో ఏలాంటి ఒత్తిడులకు తలోగ్గకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను అదేశించారు. దీంతోపాటు ప్రమాణాలు పాటించకుండా మైనింగ్ చేస్తున్న వారీపైనా, అలాంటి క్వారీలపైన కఠినంగా వ్యవహరించాలన్నారు.
రాష్ర్టం ఏర్పడిన నాటి నుండి గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచిపేరు వస్తున్నదని, అధికారులను అభినందించిన మంత్రి, మరింత అధికంగా పని చేసేందుకు అవకాశం ఉన్నదని తెలిపారు. మైనింగ్ శాఖలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అవసరం అయిన టెక్నాలజీలను వాడాల్సిందిగా కోరారు. ముఖ్యంగా తనీఖీలను డిజిటలైజ్ చేసేందుకు ఐటి సంభందింత సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పలు శాఖల్లో ఈ మేరకు జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకోవాలన్నారు.
తనీఖీలను రీయల్ టైం మానిటరింగ్ చేసేందుకు, తనీఖీల నివేదికలను కార్యక్షేత్రం నుంచే పంపేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ మేరకు అవసరం అయితే క్షేత్రస్థాయి తనీఖీలకు వెళ్లే అదికారులకు ట్యాబులు అందించాలన్నారు. దీంతోపాటు ప్రతి గనిని జీయో ట్యాగ్ చేస్తూ, లీజు హద్దులను దాటి మైనింగ్ చేయకుండా జీయో ఫెన్సింగ్ చేయాలని, ఇలాంటి సాంకేతికను అభివృద్ది చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిని వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. గనుల శాఖ రూపొందించిన వెబ్ పొర్టల్ ను మంత్రి ఈ సందర్భంగా అవిష్కరించారు. ఈ పొర్టల్ లో తెలంగాణ గనుల గురించన పూర్తి సమాచారం ఉంటుందని, ఈ పొర్టల్ ద్వారానే గనుల శాఖకు వచ్చే చెల్లింపులను అన్ లైన్ ద్వారా చేయవచ్చని తెలిపారు. గనుల శాఖలో ఐటి వినియోగం ద్వారా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో గనుల శాఖ , టియస్ యండిసి అధికారులు పాల్గోన్నారు.