ట్విట్ట‌ర్‌లో కేటీఆర్‌కు 20 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు..

313
minister ktr

టీఆర్‌ఎస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్విట్ట‌ర్‌లో దూసుకువెళ్తున్నారు. ప్ర‌తి రోజు ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌ట‌న‌లే కాకుండా.. సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని తెలుసుకొని ఆదుకుంటారు మంత్రి కేటీఆర్‌. అయితే అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఆయన ట్విట్లర్‌లో 20 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నారు.

మంత్రి కేటీఆర్‌ తన ట్విట్ట‌ర్ ఖాతా 2010 మార్చి 10వ తేదీన ఓపెన్ చేశారు.. సాయం కావాల‌ని అభ్య‌ర్థించిన వారికి మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్ల‌తోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్న వైనం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న‌ది. ట్విట్టర్‌లో డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌ను.. రాష్ట్ర ప్ర‌జ‌లే కాదు, దేశ‌విదేశాల నుంచి కూడా ఎంతో మంది ఫాలో అవుతున్నారు.

2018 ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన కేటీఆర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ప‌ది ల‌క్ష‌లకు చేరుకున్న‌ది. తాజాగా ట్విట్ట‌ర్‌లో 20 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్ల‌తో కేటీఆర్ మ‌రో మైలురాయిని చేరుకున్నారు. 2 మిలియ‌న్ మార్క్‌ను కూడా కేటీఆర్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే అందుకున్నారు.