ఈటలకు ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత లేదు- మంత్రి కొప్పుల

44
Minister Koppula Eshwar

ఈటలకు ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత లేద మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. ఈ రోజు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. వామపక్ష భావజాలం ఉన్న ఈటల.. భాజపాలో ఎలా చేరుతున్నారు?’ అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌కు ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత లేదని కొప్పుల ఈశ్వర్‌ మాజీ మంత్రి కి హితవు పలికారు. తెరాసలో ఈటలకు దక్కినంత గౌరవం మరే ఇతర నేతకూ దక్కలేదని కొప్పుల అన్నారు. ముఖ్యమంత్రి అభినందించినపుడు ఒకలా….తప్పులను ఎత్తిచూపినపుడు మరోలా మాట్లాడటం తగదన్నారు.

ఈటల.. భాజపాలో చేరేందుకు 2 కారణాలు ఉన్నాయని… ఆత్మరక్షణ లేదా ఆస్తుల రక్షణ కోసమే భాజపాలో చేరుతున్నారని మంత్రి కొప్పుల ఆరోపించారు. వామపక్ష భావజాలంతో ఉన్న ఈటల.. భాజపాలో ఎలా చేరుతున్నారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన భాజపాలో చేరుతున్నారో ఈటల చెప్పాలన్నారు. ఈటల సొంత లబ్ధి, ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్నారు. సొంత భావజాలంతో నిల్చుంటే ఈటలను ప్రజలు గౌరవిస్తారని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల చెంత చేరినప్పుడే ఈటల ఆత్మగౌరవం పోయిందని మంత్రి కొప్పుల తెలిపారు.