వీఎం హోమ్ గురుకుల పాఠశాలకు వసతులు కల్పిస్తాం..

52
koppula

హైదరాబాద్ కొత్తపేట (సరూర్ నగర్)లోని వీఎం హోమ్ గురుకుల పాఠశాలలో మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్ . అనాథలకు మంచి విద్యనందించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

సోమవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పాఠశాల సిబ్బంది, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొప్పుల…పాఠశాలలో భోజన హాల్‌, సోలార్ వాటర్ హీటర్ల ఏర్పాటు, వాషింగ్ మిషన్లు, ఇస్త్రీ పెట్టెల కొనుగోలు, ఇస్త్రీ చేసేందుకు ఉద్యోగి నియమాకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల మరమ్మతులు, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరతానని పేర్కొన్నారు.