తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం:ఎంపీ అసద్

44
Asaduddin Owaisi

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు మజ్లిస్ అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తమ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థులను నిలబెడతాం. ఉత్తర ప్రదేశ్‌లో కూడా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాం అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీని పరిచయం చేయడానికి ఇంతకన్నా మంచి సమయం లేదన్నారు. నేను ఒక్కడినే రాజకీయంగా బయల్దేరగా.. నాతో పాటు ఎందరో కుటుంబసభ్యులు కలిసి నడిచేందుకు నిర్ణయం తీసుకుంటున్నారని, వారి అండతోనే దేశమంతా ఎంఐఎంను విస్తరిస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు.

తమిళనాడులో ఏప్రిల్‌ 6 ఒకే దశలో ఎన్నికలు జరుగుతుండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఆరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.