సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి తహర్ చంద్ గెహ్లాట్‌ను రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కలిశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తహర్ చంద్ గెహ్లాట్‌ను కలవడం జరిగింది. అణగారిన వర్గాల వారి అభివృద్ధి కొరకు చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సి ల సంక్షేమం కొరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం.మరింత అభివృద్ధి కొరకు కేంద్ర సహాయాన్ని కోరినామని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో 238 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు సమర్థవంతంగా నడుస్తున్నాయి. వాటి ద్వారా విద్యార్థులకు అన్ని వసతులను ఉచితంగా అందిస్తున్నాం. ట్రైబల్ వెల్ఫేర్ లోని మినీ గురుకులల మాదిరిగా సోషల్ వెల్ఫేర్‌లో కూడా 1 నుంచి 5 వరకు 66 మినీ గురుకులల కోసం 303 కోట్లు మంజూరు చేయాలని కోరినం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం 356 కోట్లు, బీజేఆర్సీవై ప్రతిపాదించిన 7 హాస్టల్స్ కొరకు 21 కోట్లు ప్రత్యేక కేంద్ర సహాయం కింద 201 కోట్లు సహాయం అందించాలని కేంద్రమంత్రిని కోరామని మంత్రి కొప్పుల అన్నారు.
ఎస్సి కార్పొరేషన్ ద్వారా యువత శిక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం వాటికి కేంద్రం 50 కోట్లు సహాయం అందించాలని విజ్ఞప్తి చేసాం.. ఏడిఐపి పథకం కింద దివ్యంగులకు వీల్ చైర్లు అందించేందుకు 22 కోట్లు సహాయం అందించాలని విజ్ఞప్తి చేసాం.. మా ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తామని హామీ ఇచ్చారు.
లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మినీ గురుకులాల ఏర్పాటు అంశం చాలా అవసరం.1 నుండి 5వ తరగతి విద్యార్థుల ఫౌండేషన్ బాగుంటుంది. మా విజ్ఞప్తిలన్నింటికి స్పందించి కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేయాలి. విద్యారంగ అభివృద్ధి విషయంలో తెలంగాణ నెంబర్ వన్. అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని నామా అన్నారు.
Telangana State Welfare Minister Koppula Eshwar Meet Cabinet Minister Thaawar Chand Gehlot in Delhi on Monday..