మోడీకి ధీటైనా ప్రత్యర్థి కే‌సి‌ఆరే !

198
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ మోడల్ అభివృద్దిని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కే‌సి‌ఆర్ నడుం బిగించారు. విజయనికి శుభ సూచకం అయిన దసరా రోజున టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లోకీ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఇప్పటివరకు దేశంలో కాంగ్రెస్, బీజేపీ మినహా ఏ ప్రాంతీయ పార్టీకూడా ప్రభావం చూపలేదు. దాంతో ఈ రెండు పార్టీలే జాతీయ పార్టీలుగా ముద్ర వేసుకున్నాయి. ఫలితంగా కేంద్రంలో తమకు ఎదురే లేదన్న రీతిలో చలామణి అవుతున్నారు ఈ రెండు పార్టీల నేతలు. ముఖ్యంగా బీజేపీ మోడీ నేతృత్వంలో నియంత పాలన కొనసాగిస్తోంది.

తమకు ఎదురే లేదన్నట్లుగా ప్రశ్నించే నోళ్లను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అధిష్టానం. కేంద్ర దత్త సంస్థలైన ఈడీ, సీబీఐ వంటి స్వచ్చంద సంస్థలను గుప్పిట్లో ఉంచుకొని, తమను ప్రశ్నిస్తే కేసులు పెడతామనే సంకేతాలను చెప్పకనే చెబుతోంది కేంద్ర బీజేపీ అధిష్టానం. ఇక అక్రమంగా అధికారం చేజిక్కీంచుకోవడంలో కమలనాథుల వంకర బుద్ది ఎలా ఉంటుందో మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ప్రయోగమే బెస్ట్ ఉదాహరణ. ఇంకా చాలా రాష్ట్రాలలో ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని బహిరంగంగానే చెబుతూ ప్రభుత్వాలను కూల్చే పన్నాగలు పన్నుతున్నారు కమలనాథులు. ఇలా బీజేపీ అక్రమ పాలనను గమనిస్తున్న దేశ ప్రజలు మోడీని గద్దె దించేందుకు ధీటైన ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి రాహుల్ రేస్ లో ఉన్నప్పటికి.. స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగలేకపోవడం రాహుల్ గాంధీకి బిగ్ మైనస్ అని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఆశజ్యోతిలా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కేవలం తెలంగాణ వరకు పరిమితం అయినప్పుడే కే‌సి‌ఆర్ జాతీయ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు.. రైతు బంధు, ఉచిత కరెంట్, దళిత బందు వంటి.. ఎన్నో సంక్షేమ పథకాలు దేశ ప్రజలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇక సంచలనాత్మక నిర్ణయాలు దీసుకొని ముందుకు సాగడంలో కూడా కే‌సి‌ఆర్ ది ప్రత్యేక శైలి. ఈ నేపథ్యంలో మోడీకి ధీటైన ప్రత్యర్థి కే‌సి‌ఆరే అనే అభిప్రాయం అందరిలోనూ మెదులుతోంది. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ రాజకీలల్లో కే‌సి‌ఆర్ మోడీకి షాక్ ఇవ్వడం గ్యారెంటీ అనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -