చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

353
kodali Nani

ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబునాయుడు మామ ఎన్టీఆర్‌ను మోసం చేసి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి లాక్కున్నారని కొడాలి నాని ఆరోపించారు. జగన్ మీద ఆరోపణలు చేయడానికి ఏమీ లేక కులం, మతం, తిరుపతి ప్రసాదం, గుళ్లో సంతకం, గురించి మాట్లాడుతున్నారు.

పవన్ కళ్యాణ్ చాలా నీతులు చెబుతారు. కానీ, కులం, మతం గురించి ఆయన మాట్లాడినంతగా ఎవరూ మాట్లాడరు. రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ప్రశ్నిస్తే సీఎం జగన్ చెప్పాలా’ అని కొడాలి నాని ప్రశ్నించారు.దేవినేని అవినాష్‌ను వైసీపీలో చేర్చుకున్నామని, వంశీని ఇంకా చేర్చుకోలేదని కొడాలితెలిపారు.

అలాంటి సమయంలో నలుగురు, ఐదుగురు టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. అదే సుజానా చౌదరీ, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ లాంటి నేతలు బీజేపీలో చేరితే ఈ టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టలేదు. వారిని ఏ ఒక్కడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్ విలువల్లేని వ్యక్తి కాదని, రాజీనామా చేశాకే చేర్చుకుంటామన్న మాటకు కట్టుబడి ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.

Minister Kodali Nani Fires On Former Cm Chandrababu Naidu