సూర్యాపేటలో ఆటల జాతర.. మైదానాన్ని పరిశీలించిన మంత్రి..

417
minister jagadish reddy
- Advertisement -

47వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల ఛాంపియన్ షిప్-2021 కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా కేంద్రం ముస్తాబు అవుతోంది. ఈ నెల 22న ప్రారంభం కానున్న ఈ పోటీలలో పాల్గొనేందుకు గాను 29 రాష్ట్రాల నుండి టీంలు పాల్గొనబోతున్నాయి. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను వీక్షించేందుకు వీలుగా 15,000పై చిలుకు ఆడియెన్స్ కు సరిపోను ఏర్పాట్లను చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తల్లి పేరుతో ఏర్పాటైన దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ పేరుతో యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.రాష్ట్ర మరియు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ కబడ్డీ పోటీలలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి తరలి వస్తున్న క్రీడాకారులకు వసతి,బోజనాది ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.

వసతి సౌకర్యాలలో ఎక్కడ లేమి లేకుండా చూడడంతో పాటు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్న క్రీడాకారులకు వారి వారి ప్రాంతాలలోని ఆహారపు అలవాట్లుకు అనుగుణంగా బోజనాది సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.ఈ పోటీలలో విజయం సాధించిన టీంలకు ఇవ్వాల్సిన కప్ లను ఇటీవల రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలసి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎల్ బి స్టేడియంలో ఆవిష్కరించిన విషయం విదితమే. అందుకు కొనసాగింపుగా ఈ రోజు సాయంత్రం మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జాతీయస్థాయిలో జరుగనున్న క్రీడా మైదానంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఉండాల్సిన సౌకర్యాలపై పలు సూచనలు చేశారు.

అదే సమయంలో జాతీయస్థాయిలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆతిధ్యం ఇస్తున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోటీలకు స్థానిక క్రీడాకారులకు స్ఫురణకలిగించడతో పాటు ఆ పోటీలలో పాల్గొనేందుకు వీలుగా మంత్రి జగదీష్ రెడ్డి దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ స్మారకర్థం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 20 నుండి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు.గ్రామాల వారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో విజేతలుగా నిలబడిన టీం లతో మొదట మండలాల వారిగా ఆ పై నియోజకవర్గ స్థాయిలోను నిర్వహించాలని నిర్ణయించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలబడిన వారికి ప్రధమ బహుమతి కింద 10,000 రూపాయల నగదు మరియు షీల్డ్ ద్వితీయ బహుమతి కింద షీల్డ్ తో పాటు 8,000 నగదు తృతీయ బహుమతి కింద 6,000 నగదు షీల్డ్,చతుర్ద బహుమతి కింద 4,000 నగదు షీల్డ్ ను ప్రకటించారు.

అదే విదంగా నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలలో విజేతలుగా నిలబడిన వారికి కూడా ప్రధమ, ద్వితీయ, తృతీయ, చతుర్ద టీంలకు షీల్డ్ లతో పాటు మొదటి స్థానంలో నిలబడిన వారికి 20,000 వేల నగదు ద్వితీయ స్థానం వారికి 18,000 తృతీయ స్థానం లో ఉన్న వారికి 16,000 వేలు చతుర్ద స్థానం లో నిలిచిన వారికి 14,000 వేల నగదు బహుమతులు ప్రకటించారు.దానితో పాటుగా బెస్ట్ రైడర్,బెస్ట్ క్యాచర్,అల్ రౌండర్ వంటి వ్యక్తిగత బహుమతులు అందజేస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ వెల్లడించింది.

- Advertisement -