ఉత్తమ్ ఉత్తర ప్రగల్భాలు ఆపాలి-మంత్రి జగదీష్ రెడ్డి

279
- Advertisement -

నేడు నల్గొండలో ఆర్‌ఓ వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని జిల్లా నుంచి పారదోలాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుద్ది చేప్పేందుకు ప్రజలు సిద్ధం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్థాననే నమ్మకమే ఉంటే.. ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.

ఉత్తమ్ కుమార్ ఉత్తర ప్రగల్భాలు ఆపాలి.. వాల్ల ఓటమిని ముందే అంగీకరించే పరిస్థితి వచ్చింది. ఉత్తమ్ కుమార్ నాయకత్వంపై మీ నేతలకే నమ్మకం లేదని మంత్రి జగదీశ్ రెడీ అన్నారు. చంద్రబాబు ఒకప్పుడు విర్రవీగితే…. నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భావన్ కు తాళాలు పడ్డాయి. త్వరలోనే గాంధి భవన్ కు తాళాలు పడటం కాయం అని ఆయన అన్నారు.

Minister Jagadish Reddy

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పాపానికి కాంగ్రెస్ వారే కారణం.. నాలుగున్నర సంవత్సరాల కాలంలో దీనికి పరిష్కరనికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు.యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 30000కోట్ల తో నిర్మాణం. ఇండస్ట్రియల్ పార్క్, యాదాద్రి టెంపుల్ టౌన్ లాంటివి ఎన్నో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.

నల్లగొండ జిల్లా గులాబీ కోట అని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో రుజువు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఫలితలు రిపీట్ అవుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల మెజార్టీ రాకపోతే పదవిలో ఉండనన్న ఉత్తమ్ ఎందుకు మాట తప్పాడు. జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీట్ టీఆరెస్ గెలిచినా రాజకీయ సన్యాసం అన్న రాజగోపాల్ రెడ్డి బట్టలు విప్పుకోలేందుకు అయన ఎద్దేవ చేశారు.

అనంతరం వేమిరెడ్డి నరసింహ రెడ్డి మాట్లాడుతూ…నా గెలుపు నల్లేరు పై నడకే.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి.సేవ గుణంతో రాజకీయాల్లోకి వచ్చాను. నిజాయితీగా వ్యాపారాలు చేసే నాకు సీఎం కేసీఆర్ ప్రజా సేవ చేసే భాగ్యం కల్పించారు. నల్గొండ MPగా భారీ మెజార్టీ తో గెలుస్తా. పార్లమెంటులో జిల్లా సమస్యలును ప్రస్తావించి పరిష్కారం చూపుతా.. సీఎం కేసీఆర్ కేంద్రంలో శక్తిగా మారుతారు.

- Advertisement -