వడ్ల కొనుగోళ్లపై పోరాటం ఆగదు:తెలంగాణ మంత్రులు

102
jagadish
- Advertisement -

వడ్లు కొనుగోళ్లు చేపట్టే వరకు పోరాటం ఆగదని తెలిపారు మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి…మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయం అన్నారు. కేసీఆర్ మహాధర్నా రైతులకు నాయకత్వం వహిస్తుందని మోడీ నమ్మారు- ఈ సెగ ఢిల్లీ వరకు చేరుతోందనే భయమే ఈ ప్రకటన అన్నారు.

చట్టాలు ఉపసంహరణ చేసినంత మాత్రాన టీఆర్ఎస్ పోరాటం ఆగదు…రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు కేసీఆర్ ఉద్యమం చేస్తారని తెలిపారు. విద్యుత్ చట్టాలను మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలన్నారు.

సమగ్ర వ్యవసాయ పధ్ధతిపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. బాయిల్డ్ రైస్ కేవలం అన్నం తినడానికి మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. కేంద్రం కొత్త టెక్నాలజీని ఉపయోగించడం లేదని…అధికారిక ప్రకటన వచ్చే వరకు మా పోరాటం సాగిస్తాం అన్నారు.

- Advertisement -