రైతు శక్తిని రుచి చూపించారు: హరీష్‌ రావు

178
harish
- Advertisement -

రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారన్నారు మంత్రి హరీష్‌ రావు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన హరీష్ రావు..రైతులు విజయం సాధించినతీరు అద్భుతమన్నారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయమని పేర్కొన్నారు.

ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ కానన్లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం. ఇది రైతు విజయం, ఇది దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు అని పేర్కొన్నారు.

- Advertisement -