దేవి నవరాత్రి ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం..

167
kcr

ప్రతియేటా ఎంతో వైభవోపేతంగా జరిగే వ‌రంగ‌ల్‌ శ్రీ భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరుతూ సీఎం కేసీఆర్‌కు రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం ప‌త్రిక‌ను అంద‌జేశారు. వరంగల్ మహానగరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈ నెల17వ తేదీ నుండి ఎంతో వైభవంగా జరిగే ‘దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి దేవి నవరాత్రుల ఆహ్వానం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ఈ.వో ఆర్.సునీత ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజశర్మ తదితరులన్నారు.ఈ సంద‌ర్భంగా ఉత్సవాల కరపత్రాలను మరియు పోస్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.