ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..

45
- Advertisement -

నిర్మల్ పట్టణం దివ్యా గార్డెన్ లో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఫోటోకు ఆడబిడ్డలు రాఖీ కట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపిట వేస్తుందని, మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి అన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు.. కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ,కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఒంటరి మహిళ, లాంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా తల్లి బిడ్డకు అవసరమైన 16 వస్తువులు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు మగ బిడ్డ పుడితే రూ. 12 వేలు, కూడా అందజేస్తున్నామని.. డెలివరీ తర్వాత అమ్మఒడి వాహనం ద్వారా తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్నాం అని అన్నారు. అనంతరం నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 478 మంది లబ్ధిదారులకు మంజూరైనా 4కోట్ల 78 లక్షల రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

- Advertisement -