- Advertisement -
మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి దీవెనలతో కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని…. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.
స్వల్ప లక్షణాలతో తనకు కరోనా సోకిందని ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు కేటీఆర్. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
- Advertisement -