తమ అభిమాన నేతలు కోలుకోవాలని ప్రత్యేక పూజలు..

44
venkatesh

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి KTR గారు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని నల్లకుంట శ్రీ శ్రృంగేరి శంకర్ మట్ దేవాలయంలో ప్రత్యేక పూజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు , TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR గారు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని నల్లకుంట లోని శృంగేరి శంకర్ మట్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ , స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి లు గణపతి అభిషేకం,అర్చన శివ టెంపుల్ లో చంద్రమౌళిశ్వరా మహాన్యాస పూర్వక రుద్రభిషేకం,శివ అర్చన.అమ్మవారి టెంపుల్ శ్రీచక్ర పంచామృత అభిషేకం, మరియి సహస్ర నామార్చన.మహా మంగళ్ హారతి ప్రత్యేక పూజలు , అభిషేకాలు చేపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందు చూపుగా ఆలోచిస్తూ సీఎం కేసీఆర్ గారి ఆలోచనలు ఆచరణలో పెడుతూ యువతకు మార్గదర్శకం చూపిస్తున్న మంత్రి కేటీఆర్ గారికి, అదేవిధంగా భావి తరాలకు స్వచ్ఛ వాయువును అందించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక మందితో కొన్ని కోట్ల మొక్కలు నాటించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని , కరోనా వైరస్ అంతం అయి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ , స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.