ఆక్సిజన్ సరఫరాకు యుద్ద విమానాల వినియోగం

47
etela

క‌రోనా కేసుల్లో రోజురోజుకూ రికార్డులు సృష్టిస్తోంది భారత్. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా స‌రిగా లేక కొవిడ్ పేషెంట్లు మృత్యువాత ప‌డుతుండ‌టంతో కొవిడ్ పేషెంట్ల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచ‌న‌లు జారీ చేసింది. శ్వాస‌ను మెరుగుపరుచుకోవ‌డానికి, ఆక్సిజ‌నేష‌న్ కోసం ప్రోనింగ్ చేయండ‌ని స‌ల‌హా ఇచ్చింది. ముఖ్యంగా ఇంట్లోనే స్వ‌ల్ప లక్ష‌ణాల‌తోపాటు శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఆక్సిజన్ సరఫరాకు యుద్ద విమానాలను వినియోగిస్తోంది.
బేగంపేట్ విమానాశ్రయం నుండి ఒరిస్సా కి ఆక్సిజన్ టాంక్ లను దగ్గర ఉండి పంపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , సీఎస్ సోమేశ్ కుమార్.