కోమటి చెరువు మణిహారం సాకారం కావాలి..

150
Harishrao
- Advertisement -

సిద్దిపేట కోమటిచెరువు మణిహారం సాకారం కావాలన్నారు మంత్రి హరీశ్‌ రావు. సమ్మర్ స్పెషల్… సందడిగా మినీ ట్యాంక్ బండ్ మారగా సెల్ఫీ సందడిలో యువ చిన్నారులతో కిటకిటలాడింది కోమటిచెరువు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్..సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువు సందర్శించారు.

కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో జరుగుతున్న పెండింగ్ పనుల పరిశీలించారు. టాయిలెట్స్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి కాలం సమ్మర్ హాలిడేస్ ఉన్న తరుణంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావాలని ఆదేశించారు. చిల్డరెన్స్ ప్లే త్వరలో ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.

సమ్మర్ స్పెషల్ గా కోమటి చేరువు నెక్లస్ రోడ్డు పై మరో చిల్డరన్స్ ప్లే ఏర్పాటు చేశామని తెలిపిన హరీశ్‌… కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు ను మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్డును అనుసంధానం చేసే మధ్యలో కొత్తగా ఏర్పాటు చేసిన చిల్డరెన్స్ ప్లే వచ్చే వారం రోజుల్లో ప్రారంభం కావాలని ఆదేశించారు. కోమటి చెరువు మణిహారం త్వరలో సాకారం కావాలని…కోమటి చెరువు మణిహారం నెక్లస్ రోడ్డు కోమటి చెరువు కట్ట మొదలు కొని.. చివరి వరకు రింగ్ నెక్లస్ త్వరితగతిన పూర్తి కావాలని కోమటి చెరువు మణిహారం కల నెరవేరాలని అందుకు అవసరం అగు భూసేకరణ, ఇతర పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -