Harishrao:కాంగ్రెస్ హయాంలో కర్ఫ్యూ లు..కరువులు

29
- Advertisement -

కాంగ్రెస్ హయాంలో కరువులు, కర్ఫ్యూలు ఉండేవన్నారు మంత్రి హరీశ్ రావు. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి కి మద్దతుగా విఎన్ఆర్ గార్డెన్ లో మహిళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌.. కేసీఆర్ వచ్చాక ఏంచేశారు…కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచన చేయాలన్నారు. పొద్దున లేస్తే ఇబ్బంది ఏమైందో తెలుసు అదే మంచి నీళ్లకు ఇబ్బందులు ఎలా ఉండెనో గుర్తు చేసుకోవాలన్నారు. ఆనాడు మంచి నీళ్ళు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారన్నారు.

ఆనాడు మహిళలు బిందలతో ఎక్కడో ఉన్న బోరు బావుల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చే వారు కానీ ఇప్పుడు ఇంట్లోకె నీళ్లు వస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చారు.ఇవాళ ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టి హర్ ఘర్ కా జల్ అని పథకం పెట్టారన్నారు. మనం ఇచ్చే మిషన్ భగీరథ పథకం ను కేంద్ర ప్రభుత్వం కొనియాడిందని…అప్పట్లో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేవాళ్ళు….కానీ ఇప్పుడు నేను పోత బిడ్డ సర్కార్ దవాఖానకు అంటున్నారన్నారు.

మీ బస్తి లొనే మీ సుస్థిని బస్తి దవాఖానలో నయం చేసినం..ఇక్కడ సుభాష్ అన్న 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక బస్తి దవాఖానలు వచ్చాయి.లక్ష్మా రెడ్డి గెలిపిస్తే మరిన్ని బస్తి దవాఖానలు వస్తాయన్నారు. మునపటి లాగా వైద్య రంగం ఉందా….పిల్లలు పుడితే ఇంటి దగ్గర దించే వరకు కూడా మనదే బాధ్యత అన్నారు.కేసీఆర్ కిట్ ఇచ్చారు మన కేసీఆర్… ఆడబిడ్డ అండగా మన కేసీఆర్ నిలిచారన్నారు.ఆడబిడ్డకు మేనమామ లాగా కల్యాణ లక్ష్మీ తెచ్చారన్నారు.

Also Read:పవన్ భజన.. బీజేపీకి పనికొస్తుందా?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం పెట్టిన మహిళల పేరుతోనే పెట్టారన్నారు. గృహ లక్ష్మీ,కల్యాణ లక్ష్మీ,ఇప్పుడు సౌభాగ్య లక్ష్మీ తెచ్చారని గుర్తు చేశారు. ఈ సారి కారుకు ఓటు వేసి గెలిపించండి ప్రతి రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ షాప్ లలో సన్న బియ్యం ఇస్తాం అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మాల్లోక్కసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆశీర్వదించాలన్నారు.

- Advertisement -