Harishrao:తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే కుట్ర

29
- Advertisement -

కాంగ్రెస్,బీజేపీలతో తెలంగాణ ప్రజలు ఆగమవుతాయన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ములుగు మండల కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణ పనులకు మంత్రి మహమూద్ అలీతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…కాంగ్రె,బీజేపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌ రెడ్డిలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Also Read:సూపర్ స్టార్ కామెంట్స్ వైరల్

కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు బీజేపీ కిషన్ రెడ్డి వింటున్నారని…అలాగే చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ రెడ్డి వింటున్నారని వీరిద్దరితో ప్రజల బతుకులు ఆగమవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ముందు చూపుతో ఎవరు వ్యవహరిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు.

Also Read:స్టార్ హీరోలు..క్రేజీ కాంబినేషన్స్

- Advertisement -