స్టార్ హీరోలు..క్రేజీ కాంబినేషన్స్

35
- Advertisement -

త‌మిళ న‌టుడు సూర్య‌, మ‌ల‌యాళ యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ఇద్ద‌రూ క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నార‌నే వార్త తాజాగా నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఆకాశం నీ హ‌ద్దురా ఫేమ్ సుధా కొంగ‌ర‌తో సూర్య చేయ‌బోయే సినిమాలో వీరిద్ద‌రూ క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. సినిమా ఇప్ప‌టికీ అనౌన్స్ చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఈ న్యూస్‌తో ఇద్ద‌రి హీరోల ఫ్యాన్స్ తెగ సంబ‌రప‌డిపోతున్నారు. మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా రాబోతోంది.

ఈ సినిమాకు ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దుల్కర్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను మూవీ టీం విడుదల చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించనున్నారు. మొత్తానికి దుల్క‌ర్ స‌ల్మాన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. పైగా ఓ తెలుగు హీరో సినిమాలో కూడా దుల్క‌ర్ స‌ల్మాన్ ఓ అతిధి పాత్రలో నటించనున్నాడు.

Also Read:పవన్ ఆశలపై బీజేపీ నీళ్ళు చల్లుతోందా?

రామ్ పోతినేని, పూరీ జగ‌న్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా డ‌బుల్ ఇస్మార్ట్. పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌లో ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. డ‌బుల్ ఇస్మార్ట్ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ కోసం బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్‌ను తీసుకున్నారు. అలాగే మరో అతిధి పాత్రలో కూడా దుల్క‌ర్ స‌ల్మాన్ కనిపిస్తాడట. ఏది ఏమైనా దుల్కర్ నుంచి క్రేజీ కాంబినేషన్స్ వస్తున్నాయి.

Also Read:పిక్ టాక్ : ఉఫ్..హీటెక్కించేస్తోంది

- Advertisement -