నోముల మరణం దురదృష్టకరం: హరీష్‌ రావు

218
harish
- Advertisement -

టీఆర్ఎస్ సీనియర్ నేత,ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిపట్ల మంత్రి హరీష్‌ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజలకోసం, వారి హక్కుల కోసం పోరాడారన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిబద్ధతగా పనిచేశారని వెల్లడించారు. ఆయన అకాల మరణం దురదృష్టకరమని తెలిపిన హరీష్ రావు….వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిపట్ల మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరనిలోటని పేర్కొన్నారు. సీనియర్‌నేత, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

- Advertisement -