బిగ్ బాస్ 4…86 ఎపిసోడ్ హైలైట్స్

83
episode 86

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 86 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 86వ ఎపిసోడ్ నామినేషన్ ఎపిసోడ్ కావడంతో హాట్ హాట్‌గా సాగింది. మెజార్టీ సభ్యులు అవినాష్‌ని నామినేట్ చేయడం,అఖిల్- మోనాల్‌ మధ్య వాగ్వాదంతో ఎపిసోడ్ ముగిసిపోయింది.

తొలుత తాను ఎలిమినేట్ అయ్యానంటే.. ప్రేక్షకులు నా ఆట బాలేదనే కదా.. ఓట్లు వేయలేదు కదా.. నేను ఓడిపోయా.. ఎవిక్షన్ పాస్ వల్లే ముందుకు వెళ్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అవినాష్. అందర్నీ సేవ్ చేస్తున్నారు నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అంటూ సొహైల్, అఖిల్‌లతో బాధపడ్డాడు అవినాష్.

ఇక కిచెన్‌లో సొహైల్, అరియానా, అవినాష్‌లు నామినేషన్ గురించి మాట్లాడుకుంటుండగా నన్ను ఎవరూ నామినేట్ చేయకండి అని సొహైల్ అనడంతో..సారీ సొహైల్ అని వెళ్లి హగ్ చేసుకుంది అరియానా. తర్వాత సొహైల్ బుగ్గపై అరియానా ముద్దుపెట్టగా తలపై ముద్దు పెట్టి అరియానాకి సారీ చెప్పాడు సోహైల్.

తర్వాత నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌కి ఏడు కలర్ ట్యూబ్స్ ఇచ్చారు బిగ్ బాస్. వాటిని మెడలో వేసుకుని.. ఆ కలర్ ట్యూబ్‌లో ఉన్న రంగు నీళ్లని ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల బౌల్‌లో వేయాలని కోరారు. ఒక్కొక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలని కోరారు.

తొలుత హారిక.. అవినాష్, అభిజిత్‌లను నామినేట్ చేయగా అవినాష్.. మోనాల్, అఖిల్,అఖిల్.. అవినాష్, మోనాల్,అభిజిత్.. మోనాల్, హారిక,మోనాల్.. అవినాష్, అభిజిత్, అఖిల్,అరియానా.. హారిక, మోనాల్, సొహైల్,సొహైల్.. అవినాష్, అరియానాలను నామినేట్ చేశారు. దీంతో ఈ వారం ఇంటినుండి వెళ్లేందుకు అవినాష్, మోనాల్, అభిజిత్, హారిక, అఖిల్ నామినేట్ అయ్యారు.

ఇక అఖిల్-మోనాల్ ఒకరినొకరు నామినేట్ చేసుకోగా రచ్చ రచ్చ జరిగింది. అఖిల్ నువ్ బ్రెయిన్‌తో గేమ్ ఆడతావ్.. నేను హార్ట్‌తో గేమ్ ఆడతా అని మోనాల్ తెలపగా అంతే ఘాటుగా చురకలంటించారు అఖిల్. నామినేషన్ ఎపిసోడ్ తర్వాత ఇంటి సభ్యులు ఎవరిదారి వారు చూసుకోగా ఏడుస్తున్న మోనాల్‌ని ఓదార్చే ప్రయత్నం చేసింది హారిక.