కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగడం లేదన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న టౌన్ హాల్ కు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి పాల్గొని
మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్ లను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు….కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ప్రజీ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదు.కుల, మత బేధాలు లేకుండా నిరుపేదలైన ఆడ పిల్లల వివాహానికి లక్ష నూట పదహార్లు ఆర్థిక సాయం అందిస్తోంది.దేశంలో మరే రాష్ట్రం ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.
ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నవి.కరోనాతో ఆదాయం తగ్గినా ఈ ఒక్క నెలలోనే కళ్యాణ లక్ష్మి పథకం కింద 401 కోట్లు చెల్లించామన్నారు.ఇటీవలే రైతు బంధు కింద 7400 కోట్లు సాయమ్ అందించాము.ఆసరా పెన్షన్లు రెండు వేల రూపాయలు సైతం అందిస్తున్నామని చెప్పారు.ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఆందోల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి.సభలు, సమావేశాలు, శుభ కార్యాలకు వినియోగించేందుకు గాను 2 కోట్లతో టౌన్ హాల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో టౌన్ హాల్ నిర్మాణం చేస్తామన్నారు.అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయించి టౌన్ హాలును అన్ని హంగులతో నిర్మిస్కామని చెప్పారు.ఆందోల్‌లో 320 డబుల్ బెడ్ రూం ల నిర్మాణం పూర్తయిందన్నారు.అర్హులైన నిరు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి, లబ్ధిదారులను గుర్తించలని జిల్లా కలెక్టర్ హనుమంతరావును మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
నిరుపేదల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు.కోటీ 20 లక్షల తో డ్రైన్లు ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు.జోగిపేట పట్టణంలోను డబుల్ బెడ్ రూంల నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే వాటిని అర్హులను గుర్తించి ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్జెడ్పీ ఛైర్మన్ జయపాల్ రెడ్జి , కలెక్టర్ హనుమంతరావు, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.