మొక్కలునాటిన బిగ్ బాస్‌ ఫేమ్ కత్తి కార్తీక..

415
kathi karthika

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటారు బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక.సిడ్ గణేష్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక కు విత్తన గణపతిని అందజేసింది టీ న్యూస్ సిబ్బంది.

అనంతరం కత్తి కార్తీక మాట్లాడుతూ ఎం.పి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కడితో మొదలు పెట్టి దేశ వ్యాప్తంగా విస్తరించి ముందుకు తీసుకెళ్తున్నారని కత్తి కార్తీక అన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నానక్ రామ్ గూడ లోని తన నివాసంలో లో మొక్కలు నాటిన బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నానని తెలిపారు.అనంతరం మరో ముగ్గురు ( ఎమ్మెల్యే అరికపూడి గాంధీ , ఇండియా క్రికెట్ ఉమెన్ టీం కెప్టెన్ మిథాలి రాజ్ , బిగ్ బాస్ సీజన్ 1ఫేమ్ ఆదర్శ్ ) లు కూడా మొక్కలు నాటాలని కత్తి కార్తీక తెలిపారు.