గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలన్నారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. గజ్వెల్ మండలం కొలుగూరు గ్రామ సభలో మంత్రి పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కొలుగురు గ్రామం ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉంది. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా. గ్రామంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. నెలలోగా గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలి. గ్రామంలో స్మశాన వాటిక పెండింగ్ పనులకు మరో 10 లక్షలు మంజూరు చేస్తాం.
గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగి అవసరం ఉన్నన్ని ఇండ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఇంట్లో చెత్త ఉంటే దరిద్రం ఉన్నట్టు..చెత్త పోయిన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. గ్రామంలో 400 ట్రాక్టర్ల చెత్త ఇండ్లల్లోంచి బయటకు వచ్చిందంటే ఎంత దరిద్రం పోయిందో అర్థం చేసికోవచ్చు.. గ్రామంలో CC రోడ్ల నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. గ్రామ ప్రజలు ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలి. గాంధీజీ ఆశయాలను కొలుగూరులో అమలు చేయాలి. గ్రామ ప్రజలు మద్యం నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.. ఇకముందు గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే పోలీస్ లు చర్యలు తీసుకోవాలని కోరారు.